భారతదేశం, ఆగస్టు 25 -- అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. అగ్రరాజ్య ప్రభుత్వం ఇరాన్‌పై సరికొత్త ఆంక్షల అస్త్రం సంధించింది. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరని నేపథ్యంలో, ఈ సరికొత్త ఆంక్షలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగించే దేశాలపై కూడా కఠిన చర్యలు ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది.

చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక దాడి ఇదేనని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అభివర్ణించారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలు లేదా సంస్థలపై కఠినమైన ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. సైనిక చర్యకు దిగకుండానే, కేవలం ఆర్థిక దెబ్బతో ఇరాన్ ప్రభుత్వాన్ని దారికి తెచ్చేందుకు ఈ వ్యూహం ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది. ఆక్జియోస్ నివేదిక ప్రకారం ఈ ప్రణాళికను 'ఎకనామిక్ డీ-డే'గా అభివర్ణించారు.

ఇరాన్‌తో...