US Iran deal : అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం! ట్రంప్ చేతుల్లో తుది నిర్ణయం.. ఏం చేస్తారు?
భారతదేశం, మే 29 -- అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య యుద్ధం ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది! ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ 'ఆక్సియోస్' కథనం ప్రకారం.. వాషింగ్టన్, టెహ్రాన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమై, ఇరుదేశాలు ఒక మధ్యంతర శాంతి ఒప్పందం (ఎంఓయూ) డ్రాఫ్ట్‌ను సిద్ధం చేశాయి. అయితే, దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' తిరిగి తెరుచుకోనుంది.
గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న వైమానిక దాడులు, ఆర్థిక ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనాల తర్వాత.. ఇరు దేశాలూ సైనిక ఉద్రిక్తతలకు స్వస్తి పలికేందుకు మొగ్గు చూపడం ప్రపంచ దేశాలకు (ముఖ్యంగా భారత్, జపాన్ వంటి చమురు దిగుమతి దేశాలకు) పెద్ద ఉపశమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.