భారతదేశం, నవంబర్ 4 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ పీఠంపై తన రెండో విడత పదవీకాలాన్ని కొనసాగిస్తున్న వేళ, ఆయన రాజకీయ భవిష్యత్తును, పాలనా అధికారాలను శాసించే 2026 యూఎస్ మధ్యంతర ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ ఎన్నికల తొలి ఫలితాల సరళి ప్రకారం డెమోక్రటిక్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటూ ట్రంప్​నకు చెందిన రిపబ్లికన్ల ఆధిక్యంలో ఉన్న పలు స్థానాలను సొంతం చేసుకుంటోంది.

అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, ఎగువ సభ అయిన సెనెట్​లలో మెజారిటీ సాధించి, వాషింగ్టన్‌పై ట్రంప్ సాధిస్తున్న ఏకచ్ఛత్రాధిపత్యానికి బ్రేకులు వేసేందుకు డెమోక్రాట్లు దూసుకుపోతున్నారు.

అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది తెలుగు ఎన్‌ఆర్‌ఐలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఈ ఫలితాలు అత్యంత కీలకం. హెచ్-1బీ వీసా విధానాలు, గ్రీన్ కార్డ్ నిబంధనలు, నిత్యావసరాల ధరలపై ట్రంప...