భారతదేశం, మే 7 -- Urvashi Rautela: నందమూరి బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటుంది. ఆయన నటించిన చిత్రాల కంటే కూడా, బహిరంగ సభల్లో ఆయన ప్రవర్తన, అభిమానులతో వ్యవహరించే తీరుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా నటి ఊర్వశి రౌటేలా ఆయనతో తన పని అనుభవాన్ని పంచుకోవడమే కాకుండా, ఆయన చుట్టూ ముసురుకున్న వివాదాలపై కూడా స్పందించింది.
కెమెరా ముందు ఆవేశంగా కనిపించే బాలకృష్ణ.. బయట చాలా భిన్నంగా ఉంటారని ఊర్వశి రౌటేలా చెప్పుకొచ్చింది. ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతూ.. "ఆయన చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఎవరితోనైనా చాలా సులభంగా కలిసిపోతారు. ఆయనలో ఒక చిన్న పిల్లాడి లాంటి మనస్తత్వం ఉంది. ఎప్పుడూ సరదాగా ఉంటూ, తన శక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తారు'' అని ఊర్వశి తెలిపింది.
బాలయ్యతో జరిగిన ఓ వ్యక్తిగత విషయాన్ని కూడా ఊర్వశి పంచుకుంది. "గత ఏడాది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.