భారతదేశం, జూలై 16 -- Urmila Kanetkar Adinath Kothare Divorce: సినీ పరిశ్రమలో విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరాఠీ చిత్ర పరిశ్రమలో మోస్ట్ అడ్మైర్డ్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ జంట ఆదినాథ్ కొఠారే, ఊర్మిళ కనిత్కర్ తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు.

గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడివిడిగా ఉంటున్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ జూలై 16న వీరు అధికారిక ప్రకటన చేశారు. దాదాపు 15 ఏళ్ల పాటు కలిసి ప్రయాణించిన ఈ జంట.. పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఊర్మిళ కనిత్కర్ కేవలం మరాఠీలోనే కాకుండా హిందీతో పాటు పలు వెల్‌కమ్ ఒబామా వంటి తెలుగు సినిమాల్లోనూ నటించి ఇక్కడి ప్రేక్షకులకు కూడా సుపరిచితమయ్యారు. ఆదినాథ్ సైతం నటుడిగానే కాకుండా దర్శకుడిగా సత్తా చాటుతున్నారు...