Uppal IPL Match SRH vs RCB : క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్ - ఫేక్ యాప్స్‌తో జాగ్రత్త..! హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్చరికలు
భారతదేశం, మే 16 -- Fake IPL Ticket Apps : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 22న జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య మ్యాచ్‌కు నగరంలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ క్రికెటర్ల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. అయితే.. టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న ఈ విపరీతమైన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని సొమ్ముచేసుకోవడానికి సైబర్ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. నకిలీ యాప్‌లు, వెబ్సైట్ల ద్వారా టికెట్ల దోపిడీకి తెరలేపారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ఆకర్షణీయమైన ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన 'డిస్ట్రిక్ట్' (District) యాప్‌ను పోలిన రంగులు, లోగోలతోనే ఈ నకిలీ యాప్‌లను,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.