భారతదేశం, సెప్టెంబర్ 15 -- టీ కొట్టు వద్ద పది రూపాయలు చెల్లించాలన్నా, షాపింగ్ మాల్‌లో వేల రూపాయల బిల్లు కట్టాలన్నా సగటు భారతీయుడికి యూపీఐ డిజిటల్ చెల్లింపులు దైనందిన జీవితంలో భాగమైపోయాయి. ఫోన్ తీయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పిన్ ఎంటర్ చేయడంతో సెకన్లలో పని పూర్తవుతోంది. అయితే, యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధిస్తారంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న విస్తృత ప్రచారం సాధారణ వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ గందరగోళానికి తెర దించుతూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.

సెప్టెంబర్ 14న కేంద్ర ఆర్థిక శాఖ ఒక అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం, రూ.2,000 వరకు జరిపే యూపీఐ లావాదేవీలతో పాటు రూపే డెబిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై బ్యాంకులు గానీ, పేమెంట్ యాప్‌ల నిర్వాహకులు గానీ ఎలాంటి ప్రత్యక్ష...