భారతదేశం, అక్టోబర్ 24 -- Upasana Konidela: రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల శనివారం (అక్టోబర్ 24, 2026) ఒక ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మహిళల సాధికారత, తోటి మహిళలకు మద్దతుగా నిలవడం గురించి ఆమె మాట్లాడిన మాటలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో యాంకర్ సుమ కనకాలతో కలిసి పాల్గొన్న ఉపాసన.. మహిళల ఎదుగుదలపై తన పరిశోధనల్లో తేలిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సమాజంలో చాలా మంది మహిళలు తమ సొంత విజయాల కోసం లేదా స్వార్థం కోసం తోటి మహిళలను తొక్కేయడానికి వెనుకాడరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అలాంటి మనస్తత్వం ఉన్న మహిళలను ఉద్దేశించి ఉపాసన తీవ్రమైన పదజాలంతో హెచ్చరించారు. "తమ సక్సెస్ కోసం లేదా ఒక బలహీనమైన మగాడిని (Weak Man) సంతోషపెట...