భారతదేశం, నవంబర్ 9 -- న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాజకీయ వేదికపైకి కొత్త పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ అదనపు డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు నేతృత్వంలోని 'సర్వజన్ సనాతన్ పార్టీ' యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం 403 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది.

నెల రోజుల క్రితం కాశీలోని గంగా నది తీరాన సర్వజన్ సనాతన్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వరరావు, సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) ద్వారా తొలి విడత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రకటించారు.

"ఈ దరఖాస్తు కేవలం తొలి విడత ప్రాథమిక పరిశీలన కోసం మాత్రమే. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే రెండో విడతలో సమగ్ర సమా...