భారతదేశం, మే 29 -- Unified Welfare Card Telangana : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే చోట లభించేలా ఒక విప్లవాత్మకమైన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్న ప్రభుత్వ సాయాన్ని ఒకే గొడుగు కిందికి తెస్తూ 'సమగ్ర సంక్షేమ కార్డు'ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా సమగ్రమైన నివేదికను సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని. అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అం...