భారతదేశం, ఆగస్టు 18 -- హడావుడిగా ఇల్లు వదిలి, ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుని, మీటింగ్‌ల మధ్య పరుగులు పెడుతుండగా లేదా విమానం అందుకోవాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేస్తుంది. మనం తరచూ ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాము. ఇలాంటి సమయంలో దగ్గర్లోని షెల్ఫ్ నుంచి ఏదో ఒక ప్యాకెట్ తీసుకుని తినడం చాలా సులభం. అయితే ప్రయాణాల్లో లేదా హడావుడిలో ఉన్నప్పుడు, లేదా బోర్​ కొట్టినప్పుడు తీసుకునే స్నాక్ నిజంగా ఆరోగ్యకరమైనదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా?

పతంగ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శౌర్య గుప్తా మనం తినే చిరుతిండిని ఎంచుకునే ముందు ఏయే విషయాలు పరిశీలించాలో కొన్ని సూచనలు చేశారు.

హెల్తీ స్నాక్ అంటే.. కేవలం "హెల్తీ" అని లేబుల్ ఉన్న పదార్థాన్ని వెతకడం మాత్రమే కాదని శౌర్య స్పష్టం చేశారు. ఒక మంచి స్నాక్ అనేది నిజ జీవితంలో మన అవసరాలకు తగ్గట్టుగా ఉండాలని, అది రుచికర...