భారతదేశం, అక్టోబర్ 18 -- బరువు తగ్గాలనే లక్ష్యంతో చాలామంది ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. కూల్‌డ్రింకులకు బదులు డైట్ సోడాలు తాగడం, మైదా బిస్కెట్ల స్థానంలో నట్స్ తినడం, ప్లేట్ నిండా సలాడ్లు తీసుకోవడం వంటివి చేస్తారు. అయినప్పటికీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంటారు. "ఇంత పత్యం ఉంటున్నా బరువు ఎందుకు తగ్గడం లేదు?" అని మీకు అనిపిస్తుంటే.. మీకు తెలియకుండానే క్యాలరీల పరిమాణాన్ని పెంచే కొన్ని చిన్న చిన్న అలవాట్లను మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో.. మనం తీసుకునే పరిమాణం, వండే పద్ధతులు, ప్లేట్‌లో ఏ పదార్థం ఎంత ఉందనేది కూడా అంతే ముఖ్యం. న్యూట్రిషన్, మెటబాలిక్ హెల్త్ స్పెషలిస్ట్ తనయ్ మాందోవరా తెలిపిన వివరాల ప్రకారం.. బరువు తగ్గకుండా అడ్డుపడే 5 ప్రధాన అలవాట్లు, వాటికి ప్రత్యామ్న...