భారతదేశం, ఏప్రిల్ 15 -- CBSE result 2026 when : సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఫలితాలు విడుదలైన వెంటనే ఒకేసారి అందరూ అధికారిక వెబ్‌సైట్లపై పడటంతో సర్వర్లు నెమ్మదించడం సహజం. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా 'ఉమాంగ్' యాప్ ద్వారా విద్యార్థులు ఎటువంటి అంతరాయం లేకుండా తమ ఫలితాలను స్మార్ట్‌ఫోన్లలోనే చూసుకోవచ్చు.

ఫలితాలు ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఉమంగ్​ యాప్​ ద్వారా సీబీఎస్​ఈ క్లాస్​ 10 రిజల్ట్స్ ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

సాధారణంగా ఫలితాల రోజున సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్లు ట్రాఫిక్ తాకిడికి 'క్రాష్' అవుతుంటాయి. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. ఇలాంటి ...