భారతదేశం, జూన్ 11 -- దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్​ఎఫ్) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అలర్ట్! యూజీసీ నెట్ జూన్ 2026కు సంబంధించిన అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను అధికారికంగా విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు ఏ నగరంలో పరీక్షా కేంద్రం పడిందో ముందుగానే చూసుకుని, ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా ఎన్టీఏ ఈ సదుపాయాన్ని కల్పించింది.

అర్హులైన అభ్యర్థులు యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ అయిన ugcnet.nta.nic.in ను సందర్శించి తమ ఎగ్జామ్ సిటీ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

అధికారిక షెడ్యూల్ ప్రకారం.. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలు దేశవ్యాప్తంగా ఉన్న...