భారతదేశం, మార్చి 15 -- మరికొన్ని రోజుల్లో పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ కొత్త సంవత్సరం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈరోజు తులా రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది? ఈ రాశి వారికి కలిగే లాభాలు, నష్టాలు వంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. గురువు జూన్ నుంచి దశమ స్థానంలో సంచరించడం వలన అనుకూలంగా ఉంటుంది. అలాగే శని ఆరవ స్థానంలో, రాహువు డిసెంబర్ దాకా ఐదవ స్థానంలో, ఆ తర్వాత నాలుగవ స్థానంలో ఉంటాడు. కేతువు డిసెంబర్ దాకా లాభ స్థానంలో ఉంటాడు. ఇలా చూసినట్లయితే తులా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఉద్యోగస్తులకు ఈ ఏడాది బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్‌లు, పదవులు, ట్...