భారతదేశం, ఆగస్టు 4 -- Udhayanidhi Stalin Double Meaning Comments On Trisha: సినిమా, రాజకీయం రెండూ కలగాపులగంగా మారే తమిళనాడు రాజకీయాల్లో మరో వివాదం రాజేసుకుంది. తంజావూరులో నిర్వహించిన కావేరి నీటి సమస్య సభలో తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్‌లను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో, హీరోయిన్ త్రిష పేరును లాగుతూ ఉదయనిధి స్టాలిన్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

కావేరి జలాల వివాదంపై ఉదయనిధి వేదికపై నుంచి ప్రసంగిస్తున్నారు. "మన సీఎం కావేరి జలాల అంశంపై నోరు విప్పడం లేదు. డీఎంకే నాయకులపై అబద్ధపు కేసులు పెట్టడంలోనే ఆయన నిమగ్నమయ్యారు" అని విమర్శిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో సభలోని ప్రేక్షకుల నుంచి ఎవరో నటి త్రిష పే...