భారతదేశం, జూన్ 28 -- Tyrese Gibson Pooja To Lord Shiva Ganesh India Trip: హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్'లో రోమన్ పియర్స్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ స్టార్ నటుడు, సింగర్ టైరీస్ గిబ్సన్ ప్రస్తుతం భారతదేశంలో సందడి చేస్తున్నారు.

ఆయన కేవలం విహారయాత్ర కోసం కాకుండా, మానసిక ప్రశాంతత కోసం 'ఆధ్యాత్మిక విరామం' (Spiritual Sabbatical) తీసుకుని ఇక్కడికి రావడం విశేషం. ముంబై నగరంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్న ఆయన, ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి ముగ్ధులయ్యారు. తన పర్యటనకు సంబంధించిన అపురూప క్షణాలను, భావోద్వేగపూరిత అనుభవాలను టైరీస్ గిబ్సన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

హాలీవుడ్ ప్రముఖులు మానసిక ప్రశాంతత కోసం, ధ్యానం నేర్చుకోవడానికి భారతదేశానికి రావడం కొత్తేమీ కాదు. గతంల...