భారతదేశం, మే 26 -- Divyanka Tripathi Blessed With Twins: ఇప్పుడంటే ఇతర భాష సీరియల్స్‌ను రీమేక్ చేసి తెలుగు తెరపై ప్రసారం చేస్తున్నారు. కానీ, గతంలో వాటిని నేరుగా డబ్బింగ్ చేసి తెలుగు టీవీ ఛానెల్స్‌లో ప్రసారం చేసేవాళ్లు. అలా తెలుగు డబ్బింగ్ సీరియల్ ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర హీరోయిన్ దివ్యాంక త్రిపాఠి.

హిందీలో సూపర్ హిట్ సీరియల్‌లో ఏ హై మొబహబ్బతీన్ ఒకటి. ఈ సీరియల్‌ను తెలుగులో మనసు పలికే మౌనం గీతం టైటిల్‌తో ప్రసారం చేశారు. ఈ సీరియల్‌లో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ నటి దివ్యాంక త్రిపాఠి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో తన సీరియల్స్‌తో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న దివ్యాంక త్రిపాఠి తల్లిగా ప్రమోషన్ పొందింది.

అయితే, దివ్యాంకతోపాటు ఆమె భర్త వివేక్ దహియాకు కూడా హిందీలో మంచి క్రేజ్ ఉంది. భారతీయ టెలివిజన్ రంగంలోనే అత్య...