భారతదేశం, మే 4 -- తమిళనాడు ఎన్నికలు 2026లో టీవీకే పార్టీ 100కుపైగా స్థానాల్లో గెలిచింది. మే 4వ తేదీ పంచాంగం, విజయ్ జాతకంలోని రాజయోగం ప్రభుత్వాన్ని మార్చాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. తమిళనాడు రాజకీయాలకు ఈ ఉదయం కేవలం ఓట్ల లెక్కింపు కాకుండా.. కొత్త శకానికి నాంది పలికినట్లు అనిపిస్తోంది. ఫలితాలు లెక్కిస్తున్న కొద్దీ.. తమిళనాడే కాదు.. దేశం అంతా దళపతి విజయ్ పేరు మార్మోగింది. తమిళగ వెట్రి కజగం (టీవీకే) మెుదటి నుంచి ఆధిక్యం కనబరిచింది.

రాజకీయ విశ్లేషకులు దీనిని ప్రభుత్వ వ్యతిరేకత అని అంటున్నారు. కానీ జ్యోతిష్య దృక్కోణంలో చూస్తే, ఇది దశాబ్దానికి ఒకసారి సంభవించే ఒక అద్భుతమైన గ్రహాల కలయిక.. మే 4 పంచాంగం, విజయ్ జాతకం కలిసి వచ్చాయని చెబుతున్నారు.

మూలా నక్షత్రం, సిద్ధి యోగం ప్రమాదకరమైన కలయిక, ఇది అధికారంపై పైచేయి సాధించింది. జ్యోతిషశాస్...