భారతదేశం, జూన్ 25 -- Anaganaga Oka Raju TV Premiere Date: వీకెండ్‌ వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకులు టీవీల ముందు వాలిపోతారు. అలాంటి సినీ ప్రియుల కోసం జీ తెలుగు ఛానల్ అదిరిపోయే వినోదంతో రెడీగా ఉంది. థియేటర్లలో నవ్వుల రైలు పరిగెత్తించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Raju) చిత్రం ఇప్పుడు బుల్లితెర వీక్షకులను అలరించడానికి వస్తోంది.

జూన్ 28న అనగనగా ఒక రాజు సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

నవీన్ పొలిశెట్టి మార్క్ కామెడీ టైమింగ్, హృదయానికి హత్తుకునే కుటుంబ విలువలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. వెండితెరపై ఈ చిత్రాన్ని మిస్ అయిన వారితో పాటు, మళ్లీ మళ్లీ చూసి నవ్...