భారతదేశం, ఆగస్టు 1 -- Serial Actress Shubhangi Atre On Harassment: హిందీ బుల్లితెరపై 'అంగూరీ భాబీ'గా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన సీరియల్ హీరోయిన్ శుభాంగి ఆత్రే తెరపై ఎంతో నవ్వుతూ, సరదాగా కనిపిస్తారు. కానీ, ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక చేదు జ్ఞాపకం, ఇప్పటికీ గగుర్పాటుకు గురిచేసే భయంకరమైన అనుభవం ఉంది.

'హాటర్ ఫ్లై' నిర్వహించిన 'ది మేల్ ఫెమినిస్ట్' కార్యక్రమంలో పాల్గొన్న శుభాంగి ఆత్రే తన స్కూల్ డేస్‌లో ఎదురైన ఒక వేధింపుల సంఘటనను బయటపెట్టారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగిందని శుభాంగి చెప్పారు. ఒక వ్యక్తి తనను నిరంతరం వెంటాడుతూ, మానసికంగా వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.

"నా జీవితంలో అత్యంత భయానకమైన ఘట్టం అది. ఆ సమయంలో ఒక వ్యక్తి రోడ్లపైనా, పరిసరాల్లోని భవనాలపైనా నా పేరు, తన పేరు కలి...