భారతదేశం, ఏప్రిల్ 8 -- తమిళ బుల్లితెరపై విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ సీరియల్ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం మంగళవారం (ఏప్రిల్ 7) చెన్నైలోని అయ్యప్పన్ తాంగల్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. కేవలం 36 ఏళ్ల వయసులోనే సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం ఇటు చిత్ర పరిశ్రమను, అటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, సుభాషిణి తన భర్త బిబిన్ చంద్రతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న సమయంలో తీవ్రమైన వాగ్వాదానికి దిగారు. కుటుంబ కలహాలే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. మనస్తాపానికి గురైన సుభాషిణి ఆవేశంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పుట్టినరోజు (ఏప్రిల్ 12), రెండో వివాహ వార్షికోత్సవం (ఏప్రిల్ 21) దగ్గరపడుతున్న తరుణంలోనే సుభాషిణి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివే...