భారతదేశం, జూన్ 4 -- Hina Khan Slams TV Actress Shilpa Shinde: బుల్లితెరపై నటి శిల్పా షిండే లైంగిక ఆరోపణలు గతంలో సంచలనం సృష్టించాయి. దాదాపు పదేళ్ల క్రితం 'భాబీజీ ఘర్ పర్ హై' (Bhabiji Ghar Par Hain) సీరియల్ నిర్మాత సంజయ్ కోహ్లీపై లైంగిక వేధింపుల (Sexual Harassment) ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది నటి శిల్పా షిండే.

అయితే, ఇప్పుడు అదంతా అబద్ధమని నటి శిల్పా షిండే పెద్ద బాంబ్ పేల్చింది. ఇటీవల కమెడియన్ భారతి సింగ్, హర్ష్ లింబాచియాలతో జరిగిన ముఖాముఖిలో శిల్పా షిండే చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశాయి.

కేవలం కాంట్రాక్ట్ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి తనకు "మరో మార్గం లేక" ఆరోపణలు చేశానని శిల్పా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, మరో ప్రముఖ నటి హినా ఖాన్ (Hina Khan) శిల్పా షిండేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'ది జోక్ ఈజ్ ఆన్ అజ్' (The j...