భారతదేశం, మే 13 -- తులసి మొక్క అనేది కేవలం ఒక మొక్కగా కాదు, మన హిందూ ధర్మంలో సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము. విష్ణువుకి కూడా తులసి అంటే ఎంతో ప్రీతి. విష్ణువుకి పూజ చేసేటప్పుడు తులసి లేకుండా పూజ సంపూర్ణం అవ్వదు. పూజల్లో మనం తులసి దళాలను వాడుతూ ఉంటాము. అయితే తులసి దళాలను పూజల్లో ఉపయోగించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం కూడా ఎంతో ముఖ్యం.

భక్తితో తులసి దళాలను దేవుళ్లకి సమర్పిస్తే కుదరదు. కొన్ని పూజల్లో తులసి దళాలను ఏమాత్రం ఉపయోగించకూడదు. తులసి దళాలను ఈ దేవుళ్లకు సమర్పిస్తే ఫలితం తగ్గిపోతుంది. మరి తులసి దళాలను ఏ దేవుళ్లకి సమర్పించకూడదు? ఈ నియమాల వెనుక కథ కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

విఘ్నాలు తొలగించే వినాయకుడిని మొట్టమొదట మనం పూజిస్తాము. అయితే వినాయకుడికి అన్ని రకాల పత్రాలు, పుష్పాలు ఇష్టమే. కానీ తులసిని మాత్రం వినాయకుడి పూజలో ఉపయ...