భారతదేశం, మార్చి 10 -- స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనను టీటీడీ కఠినంగా అమలు చేస్తోందని వెల్లడించింది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని సూచించింది. అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని కోరింది.

భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

మరోవైపు ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 26న ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు, అవసరమైన అభివ...