భారతదేశం, మే 17 -- TTD Srivani ticket Booking : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్ట్ ఆన్‌లైన్ టికెట్ల కేటాయింపు ప్రక్రియపై వస్తున్న విమర్శలను తీవ్రంగా టీటీడీ ఖండించింది. భక్తులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ అత్యంత వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) సహకారంతో 2019 మే నెలలో ప్రారంభించిన ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ విధానాన్నే ప్రస్తుతం కొనసాగిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

గతంలో తిరుమలలో ఏరోజుకారోజు ఆఫ్‌లైన్ ద్వారా టికెట్లు జారీ చేసే విధానం ఉండేది. అయితే భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం ఈ విధానంలో మార్పులు చేశారు. కొత్త విధానం ప్రకారం... ముందుగా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను యాక్సెస్ చేసిన వారికే ప్రాధాన్యత లభిస్తుంది. ప్ర...