భారతదేశం, ఏప్రిల్ 11 -- Tirumala Srivani Tickets : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. రోజువారీగా ఆన్ లైన్ లో జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్లను ఇవాళ మాత్రం ఆఫ్ లైన్ లో జారీ చేయనున్నట్లు తెలిపింది. సర్వర్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇవాళ మధ్యాహ్నం నుంచి తిరుమలలోని అన్నమయ్య భవన్ కు ఎదురుగా ఉన్న శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ లో టికెట్లను జారీ చేస్తున్నారు. టికెట్ పొందిన భక్తులు సాయంత్రం 4 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
రోజువారీ కోటా అయిన 800 టికెట్లు పూర్తి అయ్యే వరకు మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ప్రాతిపదికన టికెట్లు జారీ చేస్తారు. రేపటి(ఏప్రిల్ 12) నుంచి యథావిధిగా శ్రీవాణి దర్శన కోటా ఆన్ లైన్ లో విడుదల చేయబడుతాయని టీటీడీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.