భారతదేశం, ఏప్రిల్ 24 -- TTD Engineering Recruitment : ఇంజినీరింగ్ విభాగంలోని పోస్టుల భర్తీకి సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో రాత పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షల ద్వారా ఏఈఈ (సివిల్), ఏఈఈ (ఎలక్ట్రికల్), ఏఈ (సివిల్), ఏటీవో (సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ వివరాలను వెల్లడించింది.

తిరుమలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆలయ నిర్మాణాలు, మరియు నిర్వహణ పనుల్లో ఇంజినీరింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఈ విభాగంలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను రెండు రోజుల్లో వివిధ షిఫ్టుల వారీగా విభజించారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి:

ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమకు అనువైన పరీక్షా కేంద్రాలను ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవాల్సి ఉంట...