భారతదేశం, మే 1 -- TTD Sculpture College Admissions 2026 : భారతీయ సనాతన ధర్మాన్ని, అపురూపమైన ఆలయ నిర్మాణ శిల్పకళను భవిష్యత్ తరాలకు అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగా.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళాశాల 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ సంస్కృతిని, వారసత్వ కళలను వృత్తిగా మార్చుకోవాలనుకునే యువతకు ఇది ఒక సువర్ణావకాశం.

4 సంవత్సరాల డిప్లొమా కోర్సు, 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులకు మే 4వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. జూన్ 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను కళాశాలలో నేరుగా పొందవచ్చు లేదా టీటీడీ వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకుని పూర్తి...