భారతదేశం, జూన్ 16 -- కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, ఇతర అన్నప్రసాదాల నాణ్యత, పవిత్రత, భద్రతను మరింత ఉన్నత ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. శ్రీవారి ప్రసాదాల తయారీ, ముడిసరుకుల నిల్వ, నాణ్యతా పరిశీలనలో అత్యాధునిక శాస్త్రీయ పద్ధతులను ప్రవేశపెట్టేందుకు మైసూర్‌కు చెందిన ప్రతిష్టాత్మక 'సీఎస్ఐఆర్-సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' (CSIR-CFTRI) సంస్థతో టీటీడీ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. శ్రీవారి ప్రసాదాల సాంప్రదాయక రుచి, విశిష్టత దెబ్బతినకుండానే అత్యున్నత భద్రత, పోషక విలువలు, నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం.

దేశంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల చరిత్రలోనే ఇలాంటి ఒక శాస్త్రీయ ఒప్పందం జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. బెంగళూరులో ర...