భారతదేశం, ఏప్రిల్ 14 -- సాధారణంగానే తిరుమలలో రద్దీ ఉంటుంది. ఇక వేసవి సెలవులు మెుదలైన తర్వాత ఈ రద్దీ ఎక్కువ అవుతుంది. దీంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు వేస్తోంది. మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలతోపాటుగా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఫాలో చేసిన నిబంధనలు అమలు చేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

కిందటి సంవత్సరాల డేటాను చూస్తే వేసవి సెలవుల్లో ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. మే, జూన్, జులై నెలల్లో ప్రతి నెల సగటున 23 నుంచి 24 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చారు. ఈ లెక్కలు పరిశీలించిన టీటీడీ వేసవి సెలవుల దృష్ట్యా.. వీఐపీ బ్రేక్, ఎస్ఎస్‌డీ టోకెన్లు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు వీఐపీ దర్శనాలకు రో...