భారతదేశం, ఆగస్టు 2 -- తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని ప్రముఖ ఆసుపత్రులకు మెడిసిన్, వైద్య పరికరాలు, ఇతర సరుకులను సరఫరా చేసే సంస్థలకు టీటీడీ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. టెండర్లలో పాల్గొనే కంపెనీలకు నిర్దేశించిన కనీస వార్షిక విక్రయాల నిబంధనను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

గతంలో ఉన్న కఠిన నిబంధనల వల్ల వేలంలో పాల్గొనే సంస్థల సంఖ్య తగ్గిపోతోందని భావించిన పాలకమండలి, జూలై 14న జరిగిన సమావేశంలో 'రిజల్యూషన్ నంబర్ 134' ద్వారా ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.

తిరుపతిలోని టీటీడీ నిర్వహించే మూడు ప్రధాన సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులకు కావలసిన మందులు, ఇంజెక్షన్లు, ల్యాబ్ పరికరాలు, సర్జికల్ వస్తువులు, రేడియాలజీ విభాగం సామాగ్రి, బ్లడ్ బ్యాంక్ ఉత్పత్తులు, ఇతర వైద్య సరకుల కొనుగోలుకు ఈ కొత్త సడలింపులు వర్తిస్తాయి.

బర్డ్ (BIRRD) - బాలాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సర్జ...