భారతదేశం, ఆగస్టు 5 -- అడవి తల్లి నమ్ముకుని జీవించే వేలాది ఆదివాసీ కుటుంబాలకు, అరకు లోయలోని కాఫీ రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ (ఏపీ జీసీసీ) ద్వారా మరింత విస్తృతంగా ఉత్పత్తులను సేకరించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల గిరిజను సేకరించే అటవీ ఉత్పత్తులకు నిలకడైన మార్కెట్ సౌకర్యం లభించడమే కాకుండా వారి ఆర్థిక పురోగతికి బాటలు పడనున్నాయి.

టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు నాయకత్వంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో జీసీసీ నుంచి వివిధ రకాల ఉత్పత్తుల సేకరణకు సంబంధించి కీలక ఆమోదం లభించింది.

అరకు లోయలోని గిరిజన రైతులు పండించే నాణ్యమైన అరేబికా కాఫీ గింజల నుంచి తయారైన 7,200 కిలోల ప్రీమియం ఇన్స్టంట్ కాఫీ పౌడర్‌ను టీటీడీ కొనుగోలు చేయనుంది. కిలో రూ. 1,414.35 చొప్పున మొత్తం రూ....