భారతదేశం, అక్టోబర్ 13 -- TSLPRB APP Results : రాష్ట్ర ప్రాసిక్యూషన్‌ సర్వీసులో ఖాళీగా ఉన్న 118 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) సోమవారం విడుదల చేసింది.

పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 17వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికేట్ వెరిఫికేషన్) ప్రారంభం కానుందని నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు.

మొత్తం 118 ఏపీపీ ఉద్యోగాల నియామకం కోసం గత ఏడాది డిసెంబరు 14వ తేదీన మండలి రెండు పేపర్లుగా రాత పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌ ( https://www.tgprb...