భారతదేశం, ఏప్రిల్ 12 -- TS Inter Supplementary Exams 2026 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు బోర్డు నుంచి అప్డేట్ వచ్చేసింది.ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే షెడ్యూల్ ను ప్రకటిస్తామని పేర్కొంది.

మే 22వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్(సప్లిమెంటరీ) పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సప్లిమెంటరీ పరీక్షలు ఫీజు చెల్లింపు ప్రక్రియ ఏప్రిల్ 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 20వ తేదీ వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు.

తాజాగా విడుదలైన ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అలాంటి విద్యార్థులు. రీ-వెరిఫికేషన్ లేదా రీ-కౌంటింగ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ విద్య...