భారతదేశం, సెప్టెంబర్ 19 -- రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదించిన 'లిండ్సే ఓ. గ్రాహం ఆంక్షల బిల్లు'పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఫలితంగా ఇది చట్టంగా మారింది. దీని ప్రకారం రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే మొదటి ఐదు దేశాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు (టారిఫ్‌లు) విధించే సర్వాధికారాలు ట్రంప్‌నకు లభించాయి.

ఫలితంగా రష్యా ఇంధన విక్రయాల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్, చైనాలు ఇప్పుడు అమెరికా టారిఫ్ ముప్పును ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఉక్రెయిన్‌తో నాలుగేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే అమెరికా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. రష్యాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురు, గ్యాస్ ఎగుమతులను అడ్...