భారతదేశం, అక్టోబర్ 19 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ గ్రాఫ్ అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది! వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్-ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. ట్రంప్ పాలనా తీరుపై ఏకంగా 66 శాతం మంది అమెరికన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆమోదయోగ్యత (అప్రూవల్ రేటింగ్) కేవలం 33 శాతానికి పడిపోయింది. గత ఏప్రిల్, జులై నెలల్లో జరిగిన సర్వేల్లో ఇది 37 శాతంగా ఉండగా, ఇప్పుడు మరింత క్షీణించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది ట్రంప్ పాలనపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 3న జరిగే అత్యంత కీలకమైన మధ్యంతర ఎన్నికలకు కొన్ని రోజులే సమయం ఉన్న తరుణంలో ఈ ఫలితాలు వెలువడటం రిపబ్లికన్ పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయావకాశాలను దెబ్బతీసే మూడు ప్రధా...