భారతదేశం, ఏప్రిల్ 17 -- Trivikram Srinivas: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47' (AK47) షూటింగ్ అప్‌డేట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ రైలు సెట్‌లో ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ.. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్ సెన్సేషనల్ కాంబినేషన్లలో ఒకటైన వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా పట్టాలెక్కుతోంది. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందంటేనే ప్రేక్షకుల్లో ఉండే అంచనాలు వేరే లెవల్లో ఉంటాయి. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మకాం వేసింది. సినిమాలోని అత్యంత కీలకమైన సన్నివేశాల కోసం అక్కడ ఒక భారీ రైలు సెట్‌ను నిర్మించారు. వ...