భారతదేశం, సెప్టెంబర్ 17 -- భారత టూవీలర్ మార్కెట్‌లో రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిళ్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా 350 సీసీ క్లాసిక్ బైక్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ప్రముఖ బ్రిటీష్ బ్రాండ్ 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్' వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రాబోయే దీపావళి పండుగ కానుకగా భారత మార్కెట్లోకి 'బోనెవిల్లే 400' (Bonneville 400) మోడల్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సర్వం సిద్ధం చేసింది.

స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ మోడళ్ల అపార విజయం తర్వాత ట్రయంఫ్ అందిస్తున్న మరో పవర్‌ఫుల్ కాంపాక్ట్ బైక్ ఇది. మహారాష్ట్ర పూణేలోని బజాజ్ ఆటో చాకన్ తయారీ కేంద్రంలో ఈ బైక్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. స్థానిక తయారీ వల్ల నాణ్యమైన ప్రీమియం బైక్‌ను సామాన్యులకు అందుబాటు ధరలో తీసుకొచ్చే అవకాశం ట్రయంఫ్‌కు దక్కింది...