భారతదేశం, మే 2 -- Sanjay Dutt Daughter Trishala Dutt Reveals Bollywood Debut: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, ది రాజా సాబ్ విలన్ సంజయ్ దత్ గారాల పట్టి త్రిషాల దత్ తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా అమెరికాలో స్థిరపడిన త్రిషాల దత్ ఒకప్పుడు తాను కూడా సినిమాల్లోకి రావాలనుకున్నానని.. కానీ, ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణం 'నటన' కాదని సంచలన విషయాన్ని బయటపెట్టారు.

సంజయ్ దత్, ఆయన మొదటి భార్య రిచా శర్మ దంపతులకు 1988లో త్రిషాల జన్మించారు. అయితే ఆమె చిన్న వయసులోనే రిచా శర్మ బ్రెయిన్ ట్యూమర్‌తో కన్నుమూయడంతో, త్రిషాల తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద అమెరికాలోనే పెరిగారు. తండ్రికి దూరంగా ఉండటం త్రిషాలను మానసికంగా ఎంతో బాధించేది. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న త్రిషాల తన కెరీర్ ఆరంభంలో ఎదురైన పరిస్థితుల గురించి మాట్లాడారు.

"నేన...