భారతదేశం, మే 10 -- Trisha Vijay: ఎంతో ఉత్కంఠ, మరెంతో సస్పెన్స్.. నిమిషం నిమిషం మారే సమీకరణాలు.. బలం కోసం ఎడతెగని ప్రయత్నాలు.. చివరకు విజయ్ సాధించారు. దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు అధిపతిగా నిలిచారు. 'సీ విజయ్ జోసెఫ్ అను నేను' అంటూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో సందడి మొత్తం త్రిషదే కావడం గమనార్హం.

ఆదివారం (మే 10) చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు తమిళనాడులోని రాజకీయ, సినీ రంగ ప్రముఖులతో పాటు నేషనల్ సెలబ్రిటీలు కూడా అటెండ్ అయ్యారు. అయితే ఇందులో అందరికంటే స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష నిలిచింది.

విజయ్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి త్రిష హాజరైంది. ఎంతో పద్ధతిగా చీరకట్టులో ఈ భామ మురిసిపోయింది. వేదిక ముందుకు వస్తూనే న...