భారతదేశం, మే 4 -- Trisha Krishnan Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వంభర'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీని పెంచగా, తాజాగా మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటిస్తున్న త్రిష కృష్ణన్ సోమవారం (మే 4) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమాలో ఆమె పోషిస్తున్న 'అవని' పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది.
తాజాగా విడుదలైన పోస్టర్లో త్రిష అత్యంత హుందాగా కనిపిస్తున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో, చేతిలో వెలుగుతున్న దీపాల పళ్ళెంతో ఆమె కనిపిస్తున్న తీరు చూస్తుంటే, సినిమాలో ఆమెది చాలా పవర్ ఫుల్, ఆధ్యాత్మికతతో కూడిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.