భారతదేశం, ఏప్రిల్ 23 -- Trisha Krishnan: తమిళనాడు ఎన్నికల వేళ నటి త్రిష కృష్ణన్ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తుఫాను సృష్టిస్తోంది. దళపతి విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక సమయంలో, ఆమె ఇచ్చిన పరోక్ష మద్దతు చూసి అభిమానులు 'వదినమ్మ ఆన్ ఫైర్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం (ఏప్రిల్ 23) అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఎన్నికలు ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు అగ్నిపరీక్ష వంటివి. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది.

ఈ నేపథ్యంలో విజయ్ హిట్‌ పెయిర్, సన్నిహిత మిత్రురాలు త్రిష కృష్ణన్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో తన తల్లి ఉమతో కల...