భారతదేశం, ఆగస్టు 11 -- Trisha Krishnan: స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ తమిళ రాజకీయాల్లో తన పేరు చుట్టూ రేగిన పొలిటికల్ తుఫాన్‌పై ఎట్టకేలకు స్పందించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వారం రోజుల సైలెన్స్ తర్వాత త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ పెట్టిన క్రిప్టిక్ పోస్ట్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఏ ఒక్కరి పేరు ఎత్తకుండానే త్రిష షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు తమిళనాడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పొలిటికల్ లీడర్లకు పరోక్షంగా క్లాస్ పీకుతూ త్రిష ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వివాదం ముదిరినప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న త్రిష.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ...