భారతదేశం, మార్చి 7 -- తమిళనాడు రాజకీయాల్లో సినిమా తారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఈ వేడి కారణంగానే దళపతి విజయ్‌ను టార్గెట్ చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తమిళ నాట ఓ వైపు రాజకీయాలతోపాటు మరోవైపు విజయ్ పర్సనల్ విషయాలు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. దళపతి విజయ్ భార్య సంగీత విడాకులు కావలంటూ చెన్నై కోర్టును ఆశ్రయించడం, హీరోకు ఓ హీరోయిన్‌తో అక్రమ సంబంధం ఉందంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు సౌత్ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపాయి.

పేరు చెప్పకుండా సంగీత చేసిన వ్యాఖ్యలు ఇన్‌డైరెక్ట్‌గా హీరోయిన్ త్రిషను చూపించాయి. విజయ్‌తో ఎఫైర్ పెట్టుకుంది హీరోయిన్ త్రిషనే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఏజీఎస్ ప్రొడక్షన్ అధినేత కల్పతి సురేష్ కుమారుడి వివాహ వేడుకకు వ...