భారతదేశం, మార్చి 15 -- దళపతి విజయ్ తో రిలేషన్ షిప్ పుకార్లు, పార్థిబన్ తో వివాదంలో హీరోయిన్ త్రిష ట్విస్ట్ ఇచ్చింది. మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దని పార్థిబన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన త్రిష.. తాజాగా అతని కూతురితో కలిసి ఫొటోలు దిగింది. స్టైలిస్ట్ ఏకా లఖానీ, రవి భగచంద్‌కా వివాహంలో ఇది చోటు చేసుకుంది.

ఏకా లఖానీ, రవి భగచంద్‌కా పెళ్లిలో తను తీసుకున్న ఫొటోలు, వీడియోలను త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో దర్శకుడు ఆర్.పార్థిబన్ కూతురు కీర్తనతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఏకా పెళ్లికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసింది. వధూవరుల వీడియోను షేర్ చేస్తూ "అత్యంత అందమైన వధువును చూశాను. లవ్ యూ మై ఏకు" అని క్యాప్షన్ ఇచ్చింది

"నార్త్ ఇండియన్ షాదీస్ ఒక వైబ్" అని వధూవరులు పూలమాలలు మార్...