భారతదేశం, జూన్ 3 -- Triptii Dimri Animal movie comments: 'యానిమల్' మూవీతో ఓవర్‌నైట్ నేషనల్ క్రష్‌గా మారిన బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి (Triptii Dimri) తనపై వస్తున్న విమర్శలపై ఎట్టకేలకు నోరు విప్పింది. ముఖ్యంగా ఆ సినిమాలో రణబీర్ కపూర్‌తో చేసిన బోల్డ్ సీన్స్, నెటిజన్ల ట్రోలింగ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో వచ్చిన 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో 'జోయా రియాజ్' పాత్రలో నటించిన తృప్తి దిమ్రికి క్రేజ్ ఎంత వచ్చిందో, అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా వచ్చింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్‌పై ఆమె ఘాటుగా స్పందించింది.

"ట్రోల్స్ నన్ను బాధించవని పైకి గంభీరంగా నటించగలను, కానీ ప్రాక్టికల్‌గా అది ...