భారతదేశం, మే 28 -- Trikala Review And Rating: తెలుగు సినీ పరిశ్రమలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కొదవలేదు. కానీ, పౌరాణిక అంశాలకు సైకలాజికల్ హారర్‌ను జోడించి 'డార్క్ ఫాంటసీ' జోనర్‌లో సినిమాలు రావడం చాలా అరుదు. సరిగ్గా ఇదే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'త్రికాల'. 'ఎ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.

బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ ప్రధాన పాత్ర పోషించిన త్రికాల సినిమాకు డైరెక్టర్ మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. హీరో మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవాంచ, నంద దొరై, రోబో శంకర్, రౌడీ రోహిణి (జబర్దస్త్) తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం.. టీజర్లు, ట్రైలర్లతోనే 'తుంబాడ్', 'కాంతార' వంటి చిత్రాల తరహా ఒక కొత్త మిస్టిక్ ప్రపంచాన్ని పరిచయం చేసింది. ...