భారతదేశం, అక్టోబర్ 27 -- Arnab Cyclone Train Cancellations : అర్నబ్ తుపాన్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. తుపాను తీవ్రత వల్ల ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల మధ్య నడిచే రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించాల్సిన మొత్తం 53 ప్రయాణీకుల, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఈ నిర్ణయంతో ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ పోర్టు, పార్వతీపురం, నరసాపురం, మచిలీపట్నం, భీమవరం, గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది.

తుఫాన్ తీవ్రత దృష్ట్యా రెండు రోజుల పాటు పూర్తిగా రద్దు చేసిన రైళ్ల వ...