భారతదేశం, సెప్టెంబర్ 3 -- SCR Train Timings Change : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పలు కీలక మార్గాల్లో నడిచే ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేసింది. ప్రధానంగా గుంటూరు, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నంద్యాల తదితర స్టేషన్ల గుండా వెళ్లే రైళ్ల సమయాలను సవరించారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

నవంబర్ మొదటి వారం నుంచే ఈ కొత్త సమయాలు అమల్లోకి రానున్నాయి. వేర్వేరు తేదీల నుంచి ఈ మార్పులు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఈ రైలు గుంటూరు స్టేషన్‌కు మునుపటి కంటే త్వరగా రానుంది. ఇప్పటివరకు మధ్యాహ్నం 15.51 గంటలకు వచ్చి 15.56 గంటలకు బయలుదేరే ఈ రైలు, నవంబర్ 7, 2026 నుంచి మధ్యాహ్నం 15.00 గంటలకే గుంటూరు చ...